BREAKING
జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

సీబీఎస్ఈ అథ్లెటిక్ ఛాంపియన్ ఎడిఫై -నాలుగు గోల్డ్ మెడల్ తో నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం

Select Suryaa Now
సీబీఎస్ఈ అథ్లెటిక్ ఛాంపియన్ ఎడిఫై -నాలుగు గోల్డ్ మెడల్ తో నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎడిఫై స్కూల్ క్రీడారంగంలో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుని చరిత్ర సృష్టించింది. ఇటీవల నిర్వహించిన సీబీఎస్ఈ అథ్లెటిక్స్ నేషనల్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకొని అండర్-14 గర్ల్స్ కేటగిరీలో జాతీయ స్థాయిలో తిరుపతి ఖ్యాతిని చాటింది. ఈ ప్రతిష్టాత్మక పోటీలలో పాఠశాలకు చెందిన నలుగురు ప్రతిభావంతులైన క్రీడాకారిణులు ఆరాధ్య, ఆద్య, హృషిక, యోహిత అద్భుత ప్రతిభ కనబరచి 4 స్వర్ణ పతకాలు సాధించారు. విద్యార్థినుల కఠోర శ్రమ, క్రమశిక్షణ, నిరంతర సాధనే ఈ విజయానికి కారణమని పాఠశాల యాజమాన్యం కొనియాడింది. కోచ్ వర్గం శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ విజయానికి పునాదిఅని స్పష్టం చేసింది. అథ్లెటెక్స్ లో గోల్డ్ మోడల్ సాధించి విజేతలుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు యాజమాన్యం ఘనంగా సత్కరించి ప్రతి విద్యార్థిని అభినందించారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన ఫిజికల్ ఎడ్యుకేషన్  కోచ్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జరగబోయే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పోటీలలో పాఠశాల తరఫున పాల్గొంటారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్