BREAKING
సత్యదేవ్, ఫరియా 'ట్రయల్ అండ్ ఎర్రర్'.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం! ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి వరుణ్ సందేశ్ ‘కాస్ట్’ టీజర్ విడుదల.. హింసాత్మక, తీవ్రమైన డ్రామాగా సరికొత్త చిత్రం! పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి రాయదుర్గం కాంగ్రెస్‌లో భారీ చేరికలు గౌని ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన 26 కుటుంబాలు కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. టాలీవుడ్‌లోకి శ్రీకాంత్ కూతురు ఎంట్రీ.. హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్న మేధ! -బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగత్ జాననీ ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలకు ఫుల్‌స్టాప్‌ రక్షణ సామగ్రితో సన్నద్ధమైన జిల్లా పోలీస్ యంత్రాంగం ‘వజ్ర’ వాహనాలు, డ్రోన్లు, రక్షణ కవచాల తనిఖీ ఎన్నికల ప్రశాంత నిర్వహణే లక్ష్యం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఘనంగా వైఎస్సార్‌సీపీ నూతన బీసీ, మైనారిటీ నేతల సన్మానం: పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బొంతు సత్య శ్రీనివాస్ పిలుపు! శారీలో తళుక్కుమన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. క్యూట్ లుక్స్‌తో నెట్టింట పిక్స్ వైరల్! ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యం ఖూనీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.సాకే హరి

సైనికుల త్యాగాలకు చిరస్మరణీయ గుర్తుగా కాశీనాయన కుంట వద్ద సుందరీకరణ పార్కు, సైనిక స్తూపం ఏర్పాటు చేస్తాం

Select Suryaa Now
సైనికుల త్యాగాలకు చిరస్మరణీయ గుర్తుగా కాశీనాయన కుంట వద్ద సుందరీకరణ పార్కు, సైనిక స్తూపం ఏర్పాటు చేస్తాం

 – ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

      గిద్దలూరుమేజర్ న్యూస్  : 16వ లైట్ క్యావల్రీ మాజీ సైనికుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 250 వ గాడ్గోర్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎండ, వాన , చలి లెక్కచేయకుండా, ప్రాణాలను సైతం పణంగా పెట్టి అహర్నిశలు దేశ సేవలో నిమగ్నమయ్యే సైనికుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం, రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సైనికుల త్యాగాలకు చిరస్థాయిగా గుర్తింపు కల్పించడం స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యతగా భావిస్తున్నానని అశోక్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గం లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్త, త్రాగు నీరు సమస్య వంటివి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినాము అని యువత కు మీ స్పూర్తిగా కాశీనాయన కుంట పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, ప్రజలందరికీ ఉపయోగపడేలా సుందరీకరణ పార్కును అభివృద్ధి చేయడంతో పాటు, పార్కు మధ్యలో సైనికుల త్యాగాలకు ప్రతీకగా సైనిక స్తూపాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశం కోసం సేవలందించిన మాజీ సైనికులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు.కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు