BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ ప్రచార ఆర్భాటమే: అనంతపురంలో చంద్రబాబుపై సాకే శైలజానాథ్ ధ్వజం, సీమ రైతులను ఆదుకోవాలని డిమాండ్ రాకా సినిమా కాస్టింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. తెరపైకి కొత్త చర్చ! పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహానటి శారద లేటెస్ట్ ఫోటోలు.. అస్సలు గుర్తుపట్టలేకపోతున్న అభిమానులు! గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: తాడేపల్లి నివాసంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు!

సారవకోటలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

Select Suryaa Now
సారవకోటలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం


- కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ.. 
- మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సన్మానం..

సారవకోట అక్టోబర్ 2 మేజర్ న్యూస్ : మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అంశాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.

ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులకు ఎదురయ్యే సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి ఐడీ కార్డులు అందజేసే కార్యక్రమంలో భాగంగా సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించి అభినందించారు. పార్టీ కార్యక్రమాల్లో వారు అందించిన సేవలను నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.