సాలూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎల్ కల్పన . -మున్సిపాలిటీని అభివృద్ధి పరుస్తా,
సాలూరు, అక్టోబర్ 23, మేజర్ న్యూస్:
సాలూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సాలూరు పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ స్వర్గీయ గొర్లె మధుసూదన రావు తనయురాలు ఎల్ కల్పన మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనుంది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మంచి రాజకీయ నాయకుడిగా ఎన్నో మంచి పనులు చేసి, సాలూరు పట్టణ ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి గొర్రె మధుసూదన్ రావు యొక్క ఆశయాలను నిలబెట్టేందుకు సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా అఖండ విజయంతో తనను గెలిపించినట్లయితే మున్సిపాలిటీ అభివృద్ధికి అహర్నశలు కృషిచేసి కష్టపడి పనిచేస్తానని తెలిపారు. సాలూరు ఉన్నతకి, సాలూరు పట్టణ అభివృద్ధికి తమ వంతు సాయి శక్తుల కృషి చేస్తానని ఆమె మీడియాకు తెలియజేశారు. అంతేకాకుండా తన తండ్రి గొర్రె మధుసూదన్ రావు అడుగుజాడలలో నడిచి తన తండ్రి అయినటువంటి స్వర్గీయ గొర్లె మధుసూదన్ రావు పేరు ప్రఖ్యాతులను నిలబెట్టే విధంగా నడుచుకుంటానని తెలియజేయడం జరిగింది. ఎల్ కల్పన సాలూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికలలో నిలబడడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమెకు బ్యాట్ గుర్తును కేటాయించడం జరిగింది అని తెలిపారు. తన గుర్తు అయినటువంటి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే తనను గెలిపిస్తే సాలూరు పట్టణ వాసులందరికీ రుణపడి ఉంటాను అని రుణం తీర్చుకునే అవకాశాన్ని కల్పిస్తారని ఆమె కోరడం జరిగింది.