రేకులకుంటలో ఘనంగా అగ్రి ఎక్స్‌పో కిసాన్ మేళా
అనంతపురం బ్యూరో
రేకులకుంటలో ఘనంగా అగ్రి ఎక్స్‌పో కిసాన్ మేళా
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
అనంతపురం, సెప్టెంబర్ 29: ఏఆర్‌ఎస్ రేకులకుంటలో వ్యవసాయ శాఖ, ఆత్మ అనంతపురం, వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో మంగళవారం అగ్రి ఎక్స్‌పో కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దలవాయి రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బల్ల పల్లవి, అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న మదనపల్లిలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో శీతల గిడ్డంగుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని, పండ్ల తోటల్లో ఉత్పత్తి నాణ్యతను పెంచి రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
కిసాన్ మేళాలో వ్యవసాయ అనుబంధ శాఖలు, పరిశోధనా సంస్థలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీల ప్రదర్శనశాలలను ఏర్పాటు చేశారు. రైతులు ప్రదర్శనలను సందర్శించి ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన పొందారు.