BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ ప్రచార ఆర్భాటమే: అనంతపురంలో చంద్రబాబుపై సాకే శైలజానాథ్ ధ్వజం, సీమ రైతులను ఆదుకోవాలని డిమాండ్ రాకా సినిమా కాస్టింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. తెరపైకి కొత్త చర్చ! పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహానటి శారద లేటెస్ట్ ఫోటోలు.. అస్సలు గుర్తుపట్టలేకపోతున్న అభిమానులు! గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: తాడేపల్లి నివాసంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు!

రైల్వే లైన్ నిర్మాణ నిధుల విడుదలను స్వాగతిస్తున్నాం

Select Suryaa Now
రైల్వే లైన్ నిర్మాణ నిధుల విడుదలను స్వాగతిస్తున్నాం

అమలాపురం మేజర్ న్యూస్ కోటిపల్లి  నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పండుల రవీంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న  డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వాలు రాబోయే మూడేళ్లలో ఈ రైల్వే లైన్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆయన కోరారు.

2014-19 మధ్య తాను పార్లమెంటు సభ్యునిగా ఉన్న సమయంలో ఈ రైల్వే లైనుకు అత్యధిక నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. సుమారు రూ. 680 కోట్లతో  గౌతమి, వైనతేయ , వశిష్ఠ గోదావరి పాయలపై బ్రిడ్జీల నిర్మాణ పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు.

  ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం గత రెండేళ్లుగా విస్మరించినప్పటికీ ఇప్పటికైనా నిధులు మంజూరు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా గతంలో నిర్ణయించిన 250 కోట్లకు గాను, కేవలం రూ.100 కోట్లు మాత్రమే ప్రస్తుతం మంజూరు చేయడం జరిగిందని,పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మంజూరు చేస్తే రైల్వే లైన్ త్వరితగతిన పూర్తయ్యేందుకు మార్గం సుగమం కాగలదని ఆయన అన్నారు.రాబోయే మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.