రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలకు మహర్దశ…
రూ.11,360 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం…
60 అడుగుల రోడ్లు, డివైడర్లు, వీధి దీపాలతో మారనున్న అమలాపురం ముఖచిత్రం…
అమలాపురం మేజర్ న్యూస్ :రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. 26 జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మొత్తం రూ.11,360 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులను మెరుగుపరిచేలా అభివృద్ధి పనులకు ముక్తా మంత్రి చంద్రబాబు వర్చువల్ గా శ్రీకారం చుట్టారు
ఇందులో భాగంగా అమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా ప్రాధాన్యం లభించింది. పట్టణంలోని ప్రధాన రహదారులను 60 అడుగుల మేర విస్తరించడంతో పాటు విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు చేపట్టే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే అమలాపురం పట్టణ రూపురేఖలు గణనీయంగా మారనున్నాయి.
పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో నిర్వహించిన ‘మున్సిపాలిటీలకు మహర్దశ’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు.
భారీగా నిధులు కేటాయించడంతో అమలాపురం సహా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు వేగంపుంజుకోనున్నాయి60 అడుగుల రోడ్లు, డివైడర్లు, వీధి దీపాలు వంటి ఆధునిక వసతులతో అమలాపురం పట్టణానికి కొత్త రూపు రానుంది.