BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

రాజాం లో అంతర్జాతీయ కూచిపూడి కళాకారుల ప్రదర్శన

Select Suryaa Now
రాజాం లో అంతర్జాతీయ కూచిపూడి కళాకారుల ప్రదర్శన


రాజాం,అక్టోబర్ 12,మేజర్ న్యూస్ :
వస్త్రపురి కాలనీలో పురాటాల పోలమ్మ గ్రామదేవత ఉత్సవాలతో పాటు దసరా ఉత్సవాల్లో బేతా శ్రీనివాసరాజు శ్రీమతి నాగ కన్యక సంధ్య చందన వీరి సహకారంతో కూచిపూడి కథాకళి భరతనాట్యం గురువర్యులు డాక్టర్ రఘుపత్రుని శ్రీకాంత్ సారధ్యంలో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి ప్రదర్శనలు ఇస్తున్న శివ శ్రీ నృత్య కళానికేతన్ శ్రీకాకుళం చెందిన 30మంది కళాకారూలచే ఆదివారం రాత్రి వస్త్రపురి కాలనీలో అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు.ఈ ప్రదర్శనలో కదిరి నరసింహుడు,రామాయణం, దుర్గా దశావతారం, శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కళ్యాణం వంటి కదంశాలను హిందూ సాంప్రదాయ నృత్య ప్రాచీన కళలను కూచిపూడి నృత్య రూపంలో ప్రదర్శించారు. కూచిపూడి లో ప్రావీణ్యం పొందిన డాక్టర్ రఘుపాత్రని శ్రీకాంత్ ఆధ్వర్యంలో 2025లో రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ ఎదుట 30 మంది స్త్రీ కళాకారులతో కూచిపూడి ప్రదర్శనలు ఇవ్వడంతో ప్రధానమంత్రి మోడీ అభినందన ప్రశంసాన్ని అందుకున్నారు.అదే స్ఫూర్తితో దేశ విదేశాలలో అంతర్జాతీయంగా భారతదేశ ప్రాచీన కళలలో ఒకటి కూచిపూడి ని ప్రదర్శనలు ఇస్తూ పలు దేశాల అభినందన మన్ననలను పొందుకున్నారు. ఆదివారం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు మ్యాజిక్ షో అద్భుతంగా అలరించింది.ఇటువంటి అంతర్జాతీయ కళాకారులను రాజాం మున్సిపాలిటీ వస్త్రపురి కాలనీలో ప్రదర్శన ఇచ్చేందుకు సహకరించిన రాజాం ప్రభుత్వ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ గా మెజీషియన్ గా పిలవబడుతున్న బేత శ్రీనివాసరాజు ను మెజీషియన్ గా పలువురు అభినందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా మీడియా ఉపాధ్యక్షుడిగా టీవీ5 రిపోర్టర్ భీంపల్లి తిరుపతిరావు హాజరయ్యారు.అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ భారతదేశ కళా సంస్కృతిని దేశ విదేశాలలో అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి కథాకళి భరతనాట్యం వంటి నృత్య ప్రదర్శనలు ఇచ్చి అనేక దేశాల మన్నలను పొందిన డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ తో పాటు వారి బృందాన్నికి కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.ఈ పోరాటాల పోలమ్మ పండగలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన చప్పటి పెంటయ్య తో పాటు పండగ నిర్వాహకులకు వివిధ కళాకారులకు కాలనీ వాసులు అభినందించి సన్మానించారు.