BREAKING
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో నికెల్ గనుల కొనుగోలుకు భారత్‌కు చెందిన 'లోహమ్' కసరత్తు యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లకు ఫీజుల మోత లిథువేనియాకు అమెరికా బలగాల నూతన నియామకం 4వ సారి జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. కార్తీక్ ఆర్యన్‌కూ ప్రతిష్టాత్మక అవార్డు! రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫ్రాన్స్‌లో ఫ్రాన్సిస్ మార్గంలో పోప్ లియో పర్యటన ఐరాస వేదికగా డోనాల్డ్ ట్రంప్ కీలక భేటీలు హార్ముజ్ జలసంధి భద్రతపై అమెರಿతో చర్చలకు ఇరాన్ సంసిద్ధత సేవా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టుల రక్తదాన శిబిరం సినిమా, టీవీ, నాటక రంగాలకు నంది అవార్డులు.. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ ప్రకటన! నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి

క్యూఆర్‌ కోడ్ విధానం తొలగించాలని - డీలర్ల విజ్ఞప్తి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారుల హామీ..

Select Suryaa Now
క్యూఆర్‌ కోడ్ విధానం తొలగించాలని - డీలర్ల విజ్ఞప్తి  సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారుల హామీ..

క్యూఆర్‌ కోడ్ విధానం తొలగించాలని - డీలర్ల విజ్ఞప్తి

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారుల హామీ..


వల్లూరు డిప్యూటీ తహసీల్దార్, కమలాపురం గోడౌన్ డీటీ భాస్కర్ ఆధ్వర్యంలో మండల రేషన్‌ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అమలు చేస్తున్న క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానంపై డీలర్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే సమయంలో రెండుసార్లు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాల్సి రావడం వల్ల డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఈ విధానాన్ని తొలగించి, బియ్యం పంపిణీ ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డీలర్లు అధికారులను విజ్ఞప్తి చేశారు. డీలర్ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో వల్లూరు మండలానికి చెందిన రేషన్‌ డీలర్లందరూ పాల్గొన్నారు..