BREAKING
సోమాలియా నుంచి సైనిక ఉపసంహరణ ప్రారంభించిన ఉగాండా ఉప్పాడ తుఫాను బాధితులకు సింహాద్రి టీఎంటీ చేయూత పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం. కిష్త్వార్‌లో అత్యాధునిక భూకంప పరిశీలన కేంద్రం ప్రారంభం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్లేట్‌లెట్ మార్పులతో ముందస్తు గుర్తింపు సాధ్యమని వెల్లడించిన పరిశోధన నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేత్ బచావో అభియాన్' ‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా: దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర విశేషాలు! మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్ తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు* *టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి ప్రజావాణికి 57 వినతులు -ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అక్టోబర్‌లో 54.7కి పడిపోయిన పీఎంఐ సూచీ.. ఎగుమతుల్లో మాత్రం రికార్డు జోరు కూటమి లో లొల్లి...

ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి

పార్వతీపురం, సూర్య : పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తుగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిందని, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ఓటర్లకు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎన్నికల సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రి, విధుల నిర్వహణకు సంబంధించిన సూచనలు అందజేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడం వల్ల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసిందని, జిల్లాలోని సంబంధిత అధికారుల నుంచి అందిన నివేదికల మేరకు ఎన్నికల నిర్వహణ సజావుగా పూర్తయినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన ఓటర్లకు, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఇదే విధమైన సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి కోరారు.