ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నరసాపురం, మేజర్ న్యూస్:స్థానికఅల్లూరి కళ్యాణమండపంలో ఏపీ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజం ఉన్నతంగా ఉందన్నా, నేడు ప్రపంచంలో ఎందరో వైద్యులు, శాస్త్రవేత్తలు అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారంటే అది కేవలం గురువుల చలవే అని ఆయన కొనియాడారు. జీవితంలో సరైన మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయులు దొరకడం విద్యార్థులకు దక్కిన వరం అని పేర్కొంటూ గురువుల సేవలను గుర్తించి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యారంగంలో సేవలందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. మరో ముఖ్య అతిథి ఆర్డీవో దాసిరాజు మాట్లాడుతూ గురువుల ప్రాధాన్యతను వివరించారు. సూర్య విద్యా సంస్థల సెక్రటరీ ఘంటసాల బ్రహ్మాజీ, బి జి బి ఎస్ మహిళా కళాశాల సెక్రటరీ నులి శ్రీనివాస్ తదితరులను సత్కరించారు.
ఇజ్రాయిల్ నరసపూర్