BREAKING
తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సిఐటియు యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోడీ

Select Suryaa Now
ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోడీ

సాలూరు, సూర్య :  ఆపరేషన్ సింధూరులో దేశభక్తి, రామ మందిర్ నిర్మాణంలో దైవభక్తి కనపరిచినందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల గుండెల్లో కలకాలం ఉన్నారు కనుకనే దేశ ప్రజలు ఆయనను మళ్లీ మళ్లీ ప్రధానమంత్రిగా గెలిపించుకుంటూ వస్తున్నారని మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రజా సేవలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి సంధ్యారాణి తన చరవాణి ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఒక ప్రకటనలో స్థానిక విలేకరులకు తెలిపారు. అందులో ఉన్న ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ లోని ఒక చిన్న రైల్వే స్టేషన్ లో తండ్రికి టీ అమ్ముడంలో సహాయం చేసిన చిన్న బాలుడు, నేడు ప్రపంచాన్ని శాసించే నాయకులలో ఒకరిగా ఎదిగినందుకు దేశ ప్రజలందరూ గర్విస్తున్నారన్నారు. మోడీ ప్రధానమంత్రిగా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్నారన్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూరులో దేశభక్తి కనబరిస్తే, మరోవైపు అయోధ్య రామ మందిరం విషయంలో దైవభక్తి చూపించారన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు, కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో కఠినమైన నిర్ణయం తీసుకోవడం వల్లే ప్రజల గుండెలో నిలిచిపోయారన్నారు. అలాంటి క్రమశిక్షణ నిబద్ధత కలిగిన వ్యక్తిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలని అన్నారు అలాంటి. నరేంద్ర మోడీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన గౌరవం మరువలేనిదన్నారు. పై సమాచారాన్ని మంత్రి సంధ్యారాణి క్యాబినెట్ సమావేశంలో ఉంటుండగా స్థానిక విలేకరులకు చేరవేశారు.

 

 

రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సాలూరు, పార్వతీపురం మన్యం.