పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన నదీమ్ అహ్మద్*
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నగరంలోని 42, 43, 44, 45, 46, 36వ వార్డులకు సంబంధించిన పలు పోలింగ్ కేంద్రాలను అనంతపురం అర్బన్ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త నదీమ్ అహ్మద్, సీనియర్ నాయకులు వై.వి. శివారెడ్డి, చవ్వా రాజశేఖర్ రెడ్డి కలిసి సందర్శించారు.
బైక్‌పై నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయా వార్డుల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను, పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో గంగన గోపాల్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.