పిడుగు పడి విద్యుత్ ఉద్యోగి మృతి
పుట్లూరు మండలం గాండ్లపాడు గ్రామ శివారులో పిడుగు పడి కోమటికుంట్ల విద్యుత్ ఉపకేంద్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న చరణ్ (35) మృతి చెందాడు.
వర్షం తీవ్రంగా కురుస్తుండటంతో చరణ్ తన బంధువు దేవనందుతో కలిసి ద్విచక్ర వాహనాన్ని నిలిపి చెట్టు కిందకు వెళ్లిన సమయంలో పిడుగు పడినట్లు సమాచారం. పిడుగు ప్రభావంతో జేబులోని మొబైల్ ఫోన్ పేలినట్లు స్థానికులు తెలిపారు.
2019 నుంచి విద్యుత్ ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చరణ్ మృతిపై టీడీపీ మండల యువ నేత శనగలగూడూరు విజయ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.