పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి* ***పెండింగ్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి* *పి జి ఆర్ ఎస్ 159, రెవిన్యూ క్లినిక్ 38 **-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం మేజర్ న్యూస్: సమస్యల పరిష్కార వేదిక లో స్వీకరించిన ఫిర్యాదులను పెండింగు లో లేకుండా నిర్ణీత గడువులో సత్వరమే నాణ్యమైన పరిష్కారం అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులతో శాఖల వారీగా ఆమె సమీక్షించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత చూపాలన్నారు.ముఖ్యంగా రెవెన్యూ , పంచాయతీ రాజ్, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సర్వే వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువ పెండింగు లో ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా, పి జి ఆర్‌ఎస్ ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆమె అన్నారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో అందుకు గల కారణాలను ఫిర్యాదుదారునికి తెలియజేయాలని అన్నారు. పి జి ఆర్ ఎస్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై సి ఎం ఓ పర్యవేక్షణ చేస్తోందని, ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారుల పై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రతి అధికారి క్షుణ్ణంగా తెలుసుకొని పథకాల అమలును ప్రజలకు వివరించాలన్నారు. కిందిస్థాయి సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ, డి ఆర్ ఓ పి. గ్లోరియా, జిల్లా కలెక్టరేట్ కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి పి ప్రభాకర రావు, జిల్లా పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై. దోసిరెడ్డి, డ్వామా పిడి కె సి హెచ్ అప్పారావు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి పీజీ ఆర్ ఎస్ 159, రెవిన్యూ క్లినిక్లు 38 ఫిర్యాదులు స్వీకరించారు.వాటిలో కొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నవి*
భీమవరo మేజర్న్యూస్ :చిన్నఅమిరం గ్రామంలో ఆర్ అండ్ బి రహదారి మార్జిన్లో జరుగుతున్న సి సి డ్రైన్ నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుచున్నవి వెంటనే విచారణ చేసి పనులు సక్రముగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.ఆచంట మండలం భీమలాపురం గ్రామం నుండి గుబ్బల సత్యనారాయణ తన 27 సెంట్లు వ్యవసాయ భూమికి ఆన్లైన్లో నందు 25 సెంట్లు మాత్రమే చూపిస్తుంది దస్తావేజు ప్రకారం సరిచేయాలని కోరారు. వీరవాసరం మండలం కొణితవాడ గ్రామం నుండి ఏ నీలాద్రి రాజు వారికి గల భూమి సర్వీస్ ఇనాం భూముల నుండి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామం నుండి కట్టుంగ సూర్యనారాయణ, ఎస్ ఎన్ 96-3ఏ -2 ఎందు 22 సెంట్లు ఎస్ ఎన్ 92-6 బి ఎందు 36 సెంట్లు భూమి ఆన్లైన్ యందు మా అన్నగారైన కట్టుంగ సత్యనారాయణ పేరున చూపిస్తున్నది. సరిచేసి మొత్తం 79 సెంట్లు భూమి ఆన్లైన్లో తన పేరున మార్చాలని కోరారు. భీమవరం మండలం తాడేరు గ్రామం నుండి కందగడ్డల నాగకృష్ణ విభిన్న ప్రతిభావంతుడు ముద్ర లోను మంజూరయ్యేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబ్యునల్ మెంబరు మేళం దుర్గాప్రసాదు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం