BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

ఫ్యాన్ స్విచ్ ఆఫ్.. గ్లాస్ సీన్ ఆన్: పెందుర్తి 77వ వార్డులో ఒకేసారి 300 మందికి జ్ఞానోదయం!

Select Suryaa Now
ఫ్యాన్ స్విచ్ ఆఫ్.. గ్లాస్ సీన్ ఆన్: పెందుర్తి 77వ వార్డులో ఒకేసారి 300 మందికి జ్ఞానోదయం!

 

* వైసీపీ 77వ వార్డు అధ్యక్షుడు, జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి కోవిరి షణ్ముఖ శివకుమార్ ఆధ్వర్యంలో చేరికలు
* జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
* కూటమి స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలి: పంచకర్ల పిలుపు

పెందుర్తి, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ :
పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జీవీఎంసీ 77వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం సుజాతనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో వైఎస్సార్‌సీపీ జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి, 77వ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కోవిరి షణ్ముఖ శివకుమార్ తో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ... జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణతాల పవన్ కళ్యాణ్  సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి, ప్రజలకు సేవ చేయాలనే తపనతో శివకుమార్ తన అనుచరులతో కలిసి జనసేనలో చేరడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలపై చురుగ్గా పనిచేసే శివకుమార్ చేరికతో 77వ వార్డుతో పాటు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం మరింత పెరిగిందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకుండా అందరూ కలిసికట్టుగా మెలిసి పనిచేయాలని పంచకర్ల మార్గదర్శనం చేశారు. "రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. సీట్ల కేటాయింపు అనేది పూర్తిగా అధినేత పవన్ కళ్యాణ్  నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరికి సీటు వచ్చినా కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం విజయాలు నమోదు చేసి, పార్టీకి, నాకు మంచి పేరు తీసుకురావాలి" అని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని చేరికలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అప్పికొండ శివాలయం మాజీ చైర్మన్ గంగరాజు, సీనియర్ నాయకురాలు షేక్ రేష్మ బేగం, దేవాడ బూత్ కన్వీనర్ కూర్మా అప్పారావు, రషీద్, మోస, కాసు కుమార్, జయరామ్, మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సోమ నాయుడు, కమల్ హాసన్, మహేష్, ప్రసాద్ తదితర వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పంచకర్ల ప్రసాద్ రావు, స్థానిక వార్డు అధ్యక్షులు కాకి బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు బిగిడి రామ గోవింద్, అప్పికొండ శివాలయం చైర్మన్ పరదేశి, వారా పైడి నాయుడు, పిట్ట కనక రెడ్డి, అజయ్ రెడ్డి, మద్ది శ్రీనివాస్, తాటి శ్రీను, మాజీ కార్పొరేటర్ దుల్లా రాము నాయుడు, సీనియర్ నాయకులు బి.ఎన్. రాజు, వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్, కంచిపాటి మధు, ఆర్.ఎస్. నాయుడు, రాపర్తి కిషోర్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.