BREAKING
సిమ్లా శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అగ్నిపర్వతంలా ఉంటుందంటూ! టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్నియామకానికి న్యాయపరమైన మద్దతు: నోయెల్ టాటా అభ్యంతరాలు తోసిపుచ్చిన బోర్డు గ్రేటర్ నోయిడాలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో: శుక్రవారం ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాలపూర్ గణపయ్యకు సబితమ్మ ప్రత్యేక పూజలు వర్షపు నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపండి: అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం శంకర్‌పల్లి ‘కే రాజా’ నిమజ్జనోత్సవానికి హాజరైన నందమూరి దీపికా జానకిరామ్ కల్పసార్ ప్రాజెక్టుపై సాంకేతిక సహకారం కోసం భారత్, నెదర్లాండ్స్ మధ్య కీలక ఒప్పందాలు వెంకటేష్ మూవీ వాయిదా.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు కొత్త రిలీజ్ డేట్ తప్పదా? హిందు పండుగల పైన రాజకీయాలు చేస్తే సహించం.సింకారు శివాజీ ఢిల్లీ వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రతపై ఏబీవీపీ ఆందోళన: వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ప్రజల సమస్యలు పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం మంత్రి కందులు దుర్గేష్ గిన్నిస్ రికార్డ్‌లో అల్లు అర్జున్ ‘రాకా’ అరుదైన ఘనత.. 37 మందితో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్! కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ. 3,02,000లకు లడ్డును దక్కించుకున్న సూర ప్రసేన్‌జిత్, శరత్ బృందం! క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సరికొత్త రక్త పరీక్ష: శాస్త్రవేత్తల కీలక పరిశోధన

పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు నీరు

Select Suryaa Now
పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు నీరు

పెట్రోల్ బంకులో డీజిల్‌కు బదులు నీరు పాడైపోయిన పలు వాహన ఇంజన్లు 

 రైతులు, వాహన యజమానులు బంక్‌ వద్ద ఆందోళన

ఉండి, మేజర్ న్యూస్: ఉండి మండలం ఎన్ ఆర్ పి అగ్రహారంలో గల భారత పెట్రోలియం బంక్‌లో డీజిల్‌కు బదులు నీరు రావడంతో ఆ నీటిని వాహనాలకు కొట్టడంతో వాహనాలు పాడైపోయి వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనలో పాములపర్రు గ్రామానికి చెందిన ఇద్దరు ఆక్వా రైతులు ఈ బంకులో డీజిల్ రెండు జనరేటర్ లో పోయడంతో అవి కాలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఐదు కార్లు, జేసీబీ కూడా దెబ్బతిన్నట్లు వాహన యజమానులు  తెలిపారు. దీంతో కార్ల యజమానులు, ఆక్వా రైతులు, జేసీబీ డ్రైవర్‌ సదరు బంక్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన బాధితులతో బంక్‌ యజమాని సంప్రదింపులు జరిపి నష్టపోయిన వారి వాహనాలు, జనరేటర్ల మరమ్మతుకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు సివిల్‌ సప్లైస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనారాయణరాజుకు సమాచారం అందించారు. దీంతో ఆయన భారత్ పెట్రోలియం బంక్‌ వద్దకు చేరుకుని యజమానితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా ఇదే బంక్‌లో ఇటువంటి ఘటనలు పలుమార్లు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని ఇప్పుడు మరొకసారి అదే పునరావతమైందని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి బంకుపై తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు. కాగా బంక్‌ యజమాని మాట్లాడుతూ బంక్‌లో రెండు డీజిల్‌ ట్యాంకులు ఉండగా వాటిలో ఒక ట్యాంకులోకి వర్షాలు కారణంగా నీరు చేరిందని తెలిపారు. దీంతో నష్టపోయిన వారికి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చామని, అందుకు వినియోగదారులు అంగీకరించడంతో ఆందోళన విరమించారని వివరించారు. ఇదిలా ఉండగా పలువురు వినియోగదారులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలంలో ఇదే విధంగా జరుగుతుందని పలుమార్లు వినియోగదారులు రోడ్డుపై ధర్నాలు చేయడం జరిగిందని అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బంకు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని అధికారులు తీరుపై మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా అధికారులు జోక్యం చేసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

 

 ఈతకోట రాజు ఉండి రిపోర్టర్