BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

పశుగ్రాస సాగుకు రైతులకు ఎకరానికి రూ.69 వేల ఆర్థిక సహాయం

Select Suryaa Now
పశుగ్రాస సాగుకు రైతులకు ఎకరానికి రూ.69 వేల ఆర్థిక సహాయం

పాడి పశువులకు నాణ్యమైన పచ్చిమేత అందించడంతో పాటు, పశుపోషణ ఖర్చులను తగ్గించి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం  వి బీకి రామ్ జి పథకం ద్వారా పశుగ్రాస సాగుకు ఆర్థిక సహాయం అందిస్తోందని పరవాడ సబ్ డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ డా. రామకృష్ణ కీర్తి తెలిపారు. పరవాడ మండలంలోని అర్హులైన పాడి రైతులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ పథకం కింద రైతులకు రెండు సంవత్సరాలకు కలిపి ఎకరానికి సుమారు రూ.69,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన భూమిలో సూపర్ నేపియర్ (కణుపు గడ్డి) మాత్రమే సాగు చేయాలని, ఇతర రకాల గడ్డిని సాగు చేయడానికి అనుమతి లేదని వివరించారు.
పశుగ్రాస సాగుకు దరఖాస్తు చేసుకునే రైతులు ఆధార్ కార్డు, జాబ్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, వన్‌బీ (1-బి) పత్రం, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలి. భూమి తప్పనిసరిగా రైతు స్వంత పేరుపై ఉండాలని, పశుగ్రాస సాగుకు ఎంపిక చేసిన భూమి ఖాళీగా ఉండాలని తెలిపారు.
అర్హతలు కలిగిన రైతులు అవసరమైన పత్రాలతో వాడచీపురుపల్లి మరియు లంకెలపాలెం  పశువైద్యాధికార్లను సంప్రదించి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని డా. రామకృష్ణ కీర్తి సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే అవకాశాలను వినియోగించుకుని పాడి అభివృద్ధికి, రైతుల ఆదాయం పెంపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రవికుమార్

ఎన్ డి పి సూర్య ప్రతినిధి