BREAKING
కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. ఈసారూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే! భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’ సమస్యల పరిష్కారమే ధ్యేయం - ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి చెత్తను సద్వినియం చేసుకోవాలి దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతున్న ద్వితీయ శ్రేణి ద్రవ్యోల్బణ ముప్పు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. అమెరికాలో దుస్తుల తయారీ సంస్థలపై టెక్సాస్ అటార్నీ జనరల్ విచారణ రాజమహేంద్రవరం పర్యటకానికి నూతన శోభ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 14 ఏళ్ల బాలిక అదృశ్యం కాల్బెమల్‌లో చోరీల కలకలం! ఒకే రాత్రి రెండు ఇళ్లకు కన్నం.. రూ.2.21 లక్షల సొత్తు అపహరణ డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి ఎన్నికల రేసులో చైనా వ్యూహాత్మక అడుగు కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ప్రజల సహకారంతో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఒంటరయ్యారు

పల్లె పండుగ 3.0తో గ్రామీణాభివృద్ధికి మరో అడుగు

Select Suryaa Now
పల్లె పండుగ 3.0తో గ్రామీణాభివృద్ధికి మరో అడుగు

పుల్లలచెరువు మేజర్ న్యూస్ 

పల్లె ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా పుల్లలచెరువు మండలంలోని పెద్ద పంచాయతీ, చిన్న పంచాయతీల్లో రూ.20 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు నాయకులు తెలిపారు.ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పుల్లలచెరువు మండల టీడీపీ నాయకులు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో రహదారుల అభివృద్ధితో ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల టీడీపీ అధ్యక్షుడు పోట్ల గోవిందు, రాష్ట్ర రైతు కార్యదర్శి, మండల సీనియర్ నాయకుడు కాకర్ల కోటయ్య, క్లస్టర్ ఇన్‌చార్జి, మండల సీనియర్ నాయకుడు రెంటపల్లి సుబ్బారెడ్డి, పుల్లలచెరువు సొసైటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శనగ వెంకటేశ్వరరెడ్డి, మండల ఎస్టీ నాయకుడు దుప్లవత్ గోపాల్ నాయక్, పీఆర్ఎసీ నాయకులు హనుమంతు నాయక్, చిన్నమంత్రు నాయక్‌తో పాటు ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.