BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

సీఐఐ సదస్సుకు పగడ్బందీ ఏర్పాట్లు

Select Suryaa Now
సీఐఐ సదస్సుకు పగడ్బందీ ఏర్పాట్లు
  • జిల్లా కలెక్టర్ కిషోర్

ఆనందపురం: ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎం-వీలో బుధవారం జరగనున్న సీఐఐ ప్రాంతీయ సదస్సును అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన ఏపీఈడీబీ సీఈవో సగిలి షాన్మోహన్‌, పరిశ్రమల శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బన్షాల్‌, జేసీ విద్యాధరి, డీసీపీ మణికంఠ తదితరులతో కలిసి సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రధాన వేదిక, సమాంతర సమావేశాలు, ప్రదర్శన, ఏపీ పెవిలియన్‌, ప్రతినిధుల నమోదు, వాహనాల నిలుపుదల, మౌలిక వసతులు, సూచిక బోర్డులు, ప్రతినిధులకు కల్పించాల్సిన సౌకర్యాలను పరిశీలించారు. సదస్సుకు హాజరయ్యే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదన్నారు. ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధికి అనుకూల వాతావరణం, మౌలిక వసతులు, వనరులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పారిశ్రామికవేత్తలకు వివరించేలా సదస్సును నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు.