పాతకోటలో ఫిల్టర్ పనులు పరిశీలిస్తున్న
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకే.గంగవరం మండలం కోట గ్రామంలో తాగునీటి పనులను ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.వి.రాజన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వేసవి కాలంలో ఎదురయ్యే తాగునీటి ఎద్దడిని నివారించడంకోసం గ్రామంలోని తాగునీటి
అత్యవసర మరమ్మతుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ విడుదల చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన లో భాగంగా ఈఈ రాజన్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో నూతనంగా అభివృద్ధి చేసిన ఫిల్టర్ (ఇసుక వడపోత) పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ ప్రక్రియల గురించి గ్రామ ఇంజినీరింగ్ అసిస్టెంట్,ట్యాంక్ వాచర్లను అడిగి నారు. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు ని
అ oతరాయంలేకుండా
చర్యలు తీసుకోవాలని, అవసరమైన మైనర్ రిపేర్ వర్క్స్ నిర్వహించడానికి సిబ్బందిని ఆదేశించారు.
ఈ పరిశీలన లో మండపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.జి.రామరావు, పంచాయతీ కార్యదర్శి పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.