BREAKING
సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి

నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రెండవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు

Select Suryaa Now
నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రెండవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు

నంద్యాల అర్బన్:నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె ప్రాంత అభివృద్ధిపై సోమవారం నుంచి చేపట్టిన రిలే దీక్షలు మంగళవారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి.
నూనెపల్లె అభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో వందేమాతరం స్పూర్తితో (మన జన్మభూమి వందనం) పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
నూనెపల్లెను కాపాడుకుందాం-గత వైభవాన్ని సాధిద్దాం, మనం పుట్టి పెరిగిన ఈ ప్రాంత రుణం తీర్చుకుందాం నినాదంతో నూనెపల్లె ప్రాంత అభివృద్ధి కోసం రోడ్డెక్కిన విషయం పాఠకులకు విదితమే. 
రెండవ రోజు రిలే నిరాహార దీక్షల్లో మంచాల భాస్కర్ రెడ్డి,  ఆమిదెల చందు  ఆమిదెల హరి, హరి ప్రసాద్, తోట సుబ్రహ్మణ్యం, మురళి, తోట కిట్టులు కూర్చున్నారు. పార్టీలకు అతీతంగా చేపట్టిన దీక్షలకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి  పి.పి.మధుసూదన్ రెడ్డి మద్దతు ప్రకటించారు.
అభివృద్ధి కమిటీ డిమాండ్స్ ఇలా ఉన్నాయి.
1.యుద్ధ ప్రాతిపదికన నూనెపల్లె రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం జరగాలి.
2.సాయిబాబా నగర్ దగ్గర శ్యామ కాలువ పై ఉన్న R&B బ్రిడ్జి విస్తరణ జరగాలి.
3.నూనెపల్లె, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్.జి.ఓ కాలనీకి వెళ్ళే రస్తా కూడలిలో సిగ్నల్ లైట్స్ వేసి ట్రా ఫిక్ నియంత్రణ జరగాలి.
4.నూనెపల్లె సెంటరులో నిత్యం పోలీసుల పర్యవేక్షణ కొరకు పికెట్ ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు.