నంద్యాల జిల్లా ప్రెస్ క్లబ్ కోసం మార్కెట్ యార్డులో స్థలం కేటాయించండి-మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి
నంద్యాల అర్బన్:నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో ఖాలీగా ఉన్న స్థలంలో మీడియా మిత్రులకు కూడా ప్రెస్ క్లబ్ కోసం స్థలాన్ని కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి కోరారు. నూనెపల్లె మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఖాలీ స్థలం ఉందని అధికారులు నివేదికలు ఇచ్చారని గుర్తుకు చేశారు. టీడీపీ కార్యాలయానికి కేటాయించిన స్థలానికి నెలకు ఎకరాకు కేవలం 85 రూపాయలకు ఇచ్చారని, అదేవిధంగా ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని కేటాయించాలని ఆ స్థలానికి వెయ్యి కాకపోతే రెండు వేలు చెల్లించేందుకు జర్నలిస్టులందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.