నెల్లిమర్లలో రెండో రోజు 65 నామినేషన్లు దాఖలు!
నెల్లిమర్ల, అక్టోబర్ 17;
నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు శనివారం అత్యంత రసవత్తరంగా సాగింది. ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. శనివారం ఒక్కరోజే వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ల నుంచి మొత్తం 65 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ల వివరాలు: చైర్మన్ పదవికి: 2 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన పార్టీకి చెందిన నాయకులు జనా ప్రసాద్, రవ్వా నాని రెబెల్స్ అభ్యర్థులుగా చైర్మన్ స్థానానికి నామినేషన్లు వేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్ స్థానాలకు: మొత్తం 63 మంది కౌన్సిలర్గా నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల వారీగా కౌన్సిలర్ నామినేషన్లు: టీడీపీ : 32 మంది వైసీపీ : 13 మంది జనసేన: 16 మంది ఇండిపెండెట్లు : ఇద్దరు ముగింపు దశకు నామినేషన్ల ప్రక్రియ నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి ఆదివారంతో (18వ తేదీ) చివరి రోజు కావడంతో, నేడు నామినేషన్ల కేంద్రాల వద్ద సందడి మరింత పెరిగే అవకాశం ఉంది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.