BREAKING
పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి:పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య

​నెల్లిమర్లలో కూటమికి 'రెబెల్' చిక్కులు..

Select Suryaa Now
​నెల్లిమర్లలో కూటమికి 'రెబెల్' చిక్కులు..
  • బీజేపీ అభ్యర్థికి షాకిచ్చిన జనసేన, టీడీపీ నేతలు

నెల్లిమర్ల, సూర్య: ​నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ పీఠం కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ  కేటాయించినప్పటికీ, నామినేషన్ల పర్వంలో కూటమి పార్టీల మధ్యే అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అధికారిక అభ్యర్థి ప్రకటన తర్వాత కూడా రెబెల్స్ బరిలో నిలవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నగర పంచాయతీ చైర్మన్ సీటు బీజేపీకి దక్కినప్పటికీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు జనా ప్రసాద్ , రవ్వా నాని లు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక శుక్రవారం నాడు టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు లెంక అప్పలనాయుడు కూడా నామినేషన్ దాఖలు చేయడంతో కూటమిలో కలవరం మొదలైంది.

​ముగ్గురు రెబెల్స్

మొత్తంగా కూటమి అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ముగ్గురు  రెబెల్స్‌గా నామినేషన్లు వేయడం కూటమి పెద్దలకు తలనొప్పిగా మారింది.
​ఒకే కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల నుంచి నాయకులు ఇలా బరిలోకి దిగడంపై హైకమాండ్ దృష్టి సారించే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు రేపు (18వ తేదీ) ఆఖరు గడువు ముగిసిన తర్వాత, అక్టోబర్ 19వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ రోజున కూటమి పెద్దలు ఈ రెబెల్స్‌ను బుజ్జగించి బరి నుంచి తప్పుకునేలా చేస్తారా లేదా అనేది నెల్లిమర్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.