BREAKING
టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. డయాబెటిస్‌పై అలర్ట్‌! చిన్న రియాక్టర్లతో ప్రైవేటు అణువిద్యుత్‌ నవంబర్ 18న ఆర్జిత సేవ కోటా విడుదల నగరపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కు సర్వం సిద్ధం... అర్హులైన పేదలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ* *పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే : ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి వెల్దుర్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ పర్యటన 10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు. కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి నేరుగా ఇంటికే అయ్యప్ప ప్రసాదం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్

నవంబర్ 18న ఆర్జిత సేవ కోటా విడుదల

Select Suryaa Now
నవంబర్ 18న ఆర్జిత సేవ కోటా విడుదల

తిరుమల, మేజర్‌న్యూస్‌ :

ఫిబ్రవరి నెల దర్శన మరియు వసతి కోటా విడుదల వివరాలు

ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నవంబర్ 18న ఆర్జిత సేవ కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా  శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.