నరవ గ్రామంలో శ్రీ సండ్రాని రవికుమార్ జ్ఞాపకార్థం ఉచిత మెగా మెడికల్ క్యాంప్
పెందుర్తి, అక్టోబర్ 4,మేజర్ న్యూస్ :
విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం, 88వ వార్డు నరవ గ్రామంలో ఇటీవల స్వర్గస్తులైన జనసేన కుటుంబ సభ్యులు క్రీస్తుశేషులు శ్రీ సండ్రాని రవికుమార్ జ్ఞాపకార్థం ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను ఆదివారం వైభవంగా నిర్వహించారు. 88వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా రవికుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ... తమ పార్టీ కుటుంబ సభ్యుడైన సండ్రాని రవికుమార్ జ్ఞాపకార్థం ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో బిపి, షుగర్, ఈసీజీ పరీక్షలతో పాటు మహిళలకు గర్భాశయ క్యాన్సర్ (గర్భసంచి) పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు వాటితో పాటు
సాయి కంటి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి 50% సబ్సిడీతో కంటి అద్దాలు అందించగా, నిరుపేదలకు జనసేన పార్టీ తరఫున ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
క్లో డెంటల్ సౌజన్యంతో ఉచితంగా దంత వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
ఈ ఉచిత వైద్య సేవలను నరవ మరియు పరిసర ప్రాంత ప్రజలు విశేషంగా వినియోగించుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గవర సత్తిబాబు, 88వ వార్డు టిడిపి అధ్యక్షుడు గంతకోరు శివ, జనసేన పార్టీ నాయకులు లింగం వాసు, గవర అప్పలరాజు, ప్రవీణ్, నవీన్, కూటమి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.