నజీర్ కు న్యాయం చేయండి. నిందితులను చట్టపరంగా శిక్షించండి. డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్:
నజీర్ కి న్యాయం చేయాలని, నిందితులను చట్టపరంగా శిక్షించాలని రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రొద్దుటూరు ఏ ఎస్ పి విభు కృష్ణ ను విజ్ఞప్తి చేశారు. గత ఆదివారం ప్రొద్దుటూరులో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో వై జంక్షన్ వద్ద షాషా అనే వ్యక్తికి జెబిల్ అనే వ్యక్తికి మధ్య వ్యాపార సంబంధంగా మాట మాట అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పూల నజీర్ మధ్యవర్తిగా, పెద్దమనిషిగా కుమారుడు జాబిద్ తో కలిసి అక్కడికి పోయారు. అక్కడికి పోయిన వెంటనే షా షా మనుసులు విచక్షణారహితంగా రాళ్లతో పూల నజీర్ మీద, ఆయన కొడుకు జాబీద్ మీద దాడి చేశారు.ఈ దాడిలో పూల నజీర్, ఆయన కుమారుడు జావీద్ కు తలకు గాయాలయ్యాయ. ఈ విషయం తెలిసిన తులసి రెడ్డి మంగళవారం ప్రొద్దుటూరులో ఏఎస్పీ విభు కృష్ణను కలిసి జరిగిన విషయాన్ని వివరించి నజీర్ కు న్యాయం చేయాలని,నిందితులను చట్టపరంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. తులసిరెడ్డి తో పాటు పూల నజీర్,ఆయన కుమారుడు జావీద్, గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాముల బ్రహ్మానంద రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ అడ్వకేట్ జిలాని భాష, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉత్తన్న, తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,చిన్నకోట్ల నాగరాజు ఏ ఎస్ పి విభు కృష్ణను కలిశారు.