BREAKING
సోమాలియా నుంచి సైనిక ఉపసంహరణ ప్రారంభించిన ఉగాండా ఉప్పాడ తుఫాను బాధితులకు సింహాద్రి టీఎంటీ చేయూత పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం. కిష్త్వార్‌లో అత్యాధునిక భూకంప పరిశీలన కేంద్రం ప్రారంభం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్లేట్‌లెట్ మార్పులతో ముందస్తు గుర్తింపు సాధ్యమని వెల్లడించిన పరిశోధన నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేత్ బచావో అభియాన్' ‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా: దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర విశేషాలు! మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్ తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు* *టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి ప్రజావాణికి 57 వినతులు -ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అక్టోబర్‌లో 54.7కి పడిపోయిన పీఎంఐ సూచీ.. ఎగుమతుల్లో మాత్రం రికార్డు జోరు కూటమి లో లొల్లి...

మురసు తుపాను నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు పకడ్బందీ ఏర్పాట్లు

Select Suryaa Now
మురసు తుపాను నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు పకడ్బందీ ఏర్పాట్లు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి, ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా, తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేపట్టేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ పి. అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా కావలి డివిజన్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ పి. అయూబ్ ఖాన్ మాట్లాడుతూ... దాదాపు 2,000 మంది సిబ్బందితో విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సంస్థ సీఎండీ గారు ప్రతి గంటకు టెలికాన్ఫరెన్స్ ద్వారా నెల్లూరు జిల్లా అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. తుపాను కారణంగా ఎక్కడైనా విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన మానవ వనరులను సిద్ధం చేశామని, ఇప్పటికే ప్రతి సెక్షన్ పరిధిలో సిబ్బందిని అందుబాటులో ఉంచామని వివరించారు.

తమిళనాడు ప్రభుత్వం 500 మంది సిబ్బందిని పంపడం అభినందనీయం:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు తమిళనాడు ప్రభుత్వం 500 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం పంపించడం అభినందనీయమని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రం సహకరించడం మంచి సంప్రదాయమని, ఇది రాష్ట్రాల మధ్య సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

భారీ స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ సామగ్రి సిద్ధం:

తుపాను ప్రభావంతో విద్యుత్ లైన్లు, స్తంభాలు దెబ్బతిన్న సందర్భంలో తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు 7,000 విద్యుత్ స్తంభాలు, 125 డిగ్గింగ్ యంత్రాలు, 115 డిజి సెట్స్  సిద్ధంగా ఉంచామని తెలిపారు. అదేవిధంగా పవర్ సా యంత్రాలు, జేసీబీలు, కండక్టర్లు, జనరేటర్లు తదితర అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి కూడా అధికారులు, సిబ్బంది సహాయక చర్యల కోసం చేరుకున్నారని తెలిపారు.

తీర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా:

కావలి, అల్లూరు, ఊటుకూరు, ముత్తుకూరు, రామతీర్థం, కోట తదితర తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచామని, వినియోగదారుల నుంచి అందే విద్యుత్ సంబంధిత ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.

తాగునీరు, ఆసుపత్రులు, వీధి దీపాలు, గృహ విద్యుత్ సరఫరాకు తొలి ప్రాధాన్యత:

తుపాను ప్రభావం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భంలో తాగునీటి సరఫరా, ఆసుపత్రులు, వీధి దీపాలు, గృహ విద్యుత్ అవసరాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపడతామని డైరెక్టర్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారి సూచనలు, సీఎండీ గారి మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు కూడా విద్యుత్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారం, మద్దతు తమకు కొండంత బలమని, అందరి సమన్వయంతో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరిస్తామని తెలిపారు.

సెల్ టవర్లకు నిరంతర విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థకు ప్రాధాన్యత:

తుపాను సమయంలో సమాచార వ్యవస్థ సక్రమంగా పనిచేయడం అత్యంత ముఖ్యమని, అందుకే సెల్ టవర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సెల్ టవర్ల వద్ద జనరేటర్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశంపై సంబంధిత యాజమాన్యాలతో మాట్లాడి, జనరేటర్లను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించినట్లు తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే అధికారుల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని, సహాయక చర్యలను వేగవంతంగా నిర్వహించగలమని వివరించారు.

ప్రతి డివిజన్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు :

జిల్లాలోని ప్రతి డివిజన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో, ఐకమత్యంగా పనిచేసి ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం మనందరి బాధ్యత అని, తద్వారా విద్యుత్ సంస్థకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని డైరెక్టర్ పి. అయూబ్ ఖాన్ సూచించారు.

చీఫ్ జనరల్ మేనేజర్ రమణా దేవి గారు సంపత్ కుమార్ గారు కావలిలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుల కేంద్రాలను సందర్శించారు

ఈ సమీక్ష సమావేశంలో చీఫ్ జనరల్ మేనేజర్లు  జె. రమణాదేవి, కె.సంపత్ కుమార్, కావలి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, శ్రీ గోపి, ఎస్‌ఈ శ్రీ రమేష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.