BREAKING
మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం కనువిందు చేసిన 150 జతల ఒంగోలు గిత్తలు! జీవో నెంబర్ 6 ను తక్షణమే అమలు చేయాలి వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి సినిమాలోని క్వీర్ అంశాలపై వస్తున్న ట్రోల్స్, నెగెటివిటీపై స్పందించిన నటుడు రిషికాంత్

మున్సిపల్ కార్మికులకు 12వ పిఆర్సి అమలు చేయాలి - సిఐటియు డిమాండ్

Select Suryaa Now
మున్సిపల్ కార్మికులకు 12వ పిఆర్సి అమలు చేయాలి - సిఐటియు డిమాండ్

గూడూరు, మేజర్‌న్యూస్‌  :  మున్సిపల్ కార్మికులకు 12వ పిఆర్‌సి కమిషన్ అమలు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, కార్మికులకు జీతాలు పెంచి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు తిరగి జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. నిత్యవసర సరుకుల ధరలను అదుపు చేయడం లేదని, కార్మికుల జీతాలు ప్రభుత్వాలు సకాలంలో పెంచడం లేదని ఆరోపించారు. కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏళ్ల తరబడి జీతాలు పెరగకపోవడం వల్ల జీవితాంతం నష్టపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన కోరికలు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ వై మల్లికార్జున్ రావుకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దారా కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు డి మణెమ్మ, కమిటీ సభ్యులు గూడూరు మని, గద్దల మేరీ, పద్మమ్మ, పెంచలమ్మ, నారాయణమ్మ, ఎం జయలక్ష్మి, గూడూరు సిఐటియు కార్యదర్శి బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.