BREAKING
తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి

మండలాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు

Select Suryaa Now
మండలాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు

చింతలపూడి మేజర్ న్యూస్  కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్, ఏలూరు శ్రీమతి బి. శ్రీలత , అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ (ఎన్‌ఫోర్స్‌మెంట్), ఏలూరు శ కె.వి.ఎన్. ప్రభు కుమార్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, ఏలూరు జిల్లా శ్రీ ఏ. ఆవులయ్య  ఆదేశాల ప్రకారం చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది కలిసి టి. నరసాపురం మండలంలో గల కొత్తగూడెం గ్రామంలో దాడులు నిర్వహించగా పాత నాటు సారాయి కేసులో పరారి లో ఉన్న రాచప్రోలు మల్లికార్జునరావు అను వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో దాడుల నిర్వహించగా బంటు సొలోమాన్ రాజు  అను వ్యక్తి వద్ద నుండి (01) లీటరు నాటు సారాయిని స్వాధీన పరుచుకుని ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడమైనది! లింగపాలెం మండలం మట్టం గూడెం గ్రామంలో గల జర్రీపోతుల మారేశ్వరరావు మరియు తాళం యేసురామ్ అను ఇరువరు వద్ద నుండి రసాయనక పరీక్షలు పంపు నిమిత్తం కల్లును శాంపుల్  చింతలపూడి మండలం లో గల పలు మద్యం దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు జరపాలని తగు సూచనలు జారీ చేసినారు! సోమవారం ఈరోజు లింగపాలెం మండలం మట్టంగూడెం గ్రామ పరిధిలో గుర్తింపు కార్డులు పొందుటకు కల్లుగీత కార్మికులకు ట్యాపింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.  ఎక్సైజ్ , రెవిన్యూ అధికారులు మరియు గ్రామ మహిళా పోలీస్, కల్లు గీత సొసైటీ ప్రెసిడెంట్ అందరి సమక్షంలో కల్లుగీత కార్మికులు చెట్టు ఎక్కు మరియు దిగుట యొక్క నైపుణ్యాన్ని  పరిశీలించే నిబంధనల ప్రకారం ట్యాపింగ్ పరీక్షను నిర్వహించినారు!ఈ దాడులలో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ. అబ్దుల్ ఖలీల్, జె. జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ. శ్రీ.పి. అశోక్ తెలిపారు!

 

 ఖలీల్ చింతలపూడి