మెట్లు పైనుంచి జారిపడి వృద్ధురాలు మృతి
కోటబొమ్మాళి: మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన కొర్ను అప్పమ్మ ( 72) ఈనెల రెండో తేదీన తన ఇంటి మెట్లు పై నుండి జారిపడి తీవ్రంగా గాయపడింది. తన కుమారుడు అప్పన్న వెంటనే 108 అంబులెన్స్ లో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు మరింత మెరుగైన వైద్యం కోసం అదే రోజు శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేయగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. విషయమై కుమారుడు అప్పన్న ఇచ్చిన ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక హెచ్. సి. ఏ. విశ్వేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృత దయ్యాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.