BREAKING
రావులపాలెంలో దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు: కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి! కాన్షీరాం స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం సాధించాలి: నత్తి మైసయ్య మార్కండేయ ఆలయ కమాన్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టు ఆర్‌కేకు జక్కంపూడి రాజా, వేణుగోపాలకృష్ణ పరామర్శ భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు డబ్బాకుపల్లి సర్పంచ్ అభ్యర్థి రేసులో ఆరుద్ర నాగేశ్వరరావు? సర్పంచ్ పదవిపై ఆసక్తి.. గ్రామంలో జోరుగా సాగుతున్న చర్చలు అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట ఎక్కడ? దేవీ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ జి.వినీత్ అభివృద్ధే లక్ష్యంగా కూటమి అడుగులు: సబ్బవరంలో రూ.2.20 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమే నిజమైన ప్రజాసేవ గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకోవాలి గ్రంధాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు జనావాసాల మధ్య ఇటుక బట్టీలను నిలిపివెయ్యాలి.. సిపిఐ మాజీ సర్పంచ్ మునుకోలుకు శ్రీనివాసరాజు పరామర్శ టియుడబ్ల్యూజే (ఐజేయు) జాతీయ సభ్యునికి సన్మానం

మల్లేశ్వరంలో పుష్కర శోభ

Select Suryaa Now
మల్లేశ్వరంలో పుష్కర శోభ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంనిడదవోలు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆయన నిరంతర కృషి, చొరవతో పెరవలి మండలంలోని మల్లేశ్వరం గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తూ సరికొత్త శోభను సంతరించుకుంటోంది.రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, స్థానికుల సౌకర్యార్థం గ్రామంలో రూ.98 లక్షల వ్యయంతో మంత్రి దుర్గేష్ సీసీ రోడ్డు మంజూరు చేయించారు. అదే విధంగా రూ.60 లక్షలతో స్థానిక గోదావరి ఘాట్‌ను భక్తులకు అనుకూలంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. మల్లేశ్వరం గ్రామాభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించి కేవలం రెండేళ్లలోనే సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, ఎంపీపీ,పంచాయతీ నిధులతో గ్రామంలో రూ.3.83 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా రూ.8 లక్షలతో 4  గోకులం షెడ్లు ఏర్పాటు చేశారు. దీనికితోడు అధ్యాత్మిక రంగానికి ప్రాధాన్యమిస్తూ టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్థానిక శ్రీ వినాయకస్వామి దేవాలయ ప్రగతికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేయించడంలో మంత్రి దుర్గేష్ కీలక పాత్ర పోషించారు. మల్లేశ్వరం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్న మంత్రి కందుల దుర్గేష్ కి  గ్రామస్తులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.