మాజీ మంత్రి విడదల రజినిని తోసివేసిన రూరల్ ఎస్‌ఐ ప్రియాంక? చిలకలూరిపేటలో ఉద్రిక్తత!
చిలకలూరిపేట మేజర్ న్యూస్:
మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద పోలీసుల తీరుపై వివాదం నెలకొంది.వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి,దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయి మాజీ మంత్రి విడదల రజినిని కలిసేందుకు ఆమె నివాసానికి వెళ్లగా,పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో తన నివాసంలోకి వస్తున్న వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని రజిని పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక,విడదల రజినిని గట్టిగా తోసివేయడంతో ఆమె కింద పడిపోయారని ఆరోపణలు వెలువడ్డాయి.అంతేకాకుండా,మరోసారి తోసేందుకు ప్రయత్నించారని కూడా ఆరోపిస్తున్నారు.మాజీ మంత్రి నివాసం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే,ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు,పోలీసుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది
కొణిదెన నరేంద్ర చిలకలూరిపేట సూర్య ఆర్సి ఇంచార్జ్