లంకెలపాలెం -పరవాడ రోడ్లు నిర్మాణం వెంటనే చేయాలి.
లంకెలపాలెం నుండి పరవాడ పరవాడ ఎన్టిపిసి రోడ్లను వెంటనే నిర్మాణ పనులను చేపట్టాలని పెద్ద పెద్ద గోతులతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు అనుభవిస్తున్నారని సోమవారం జిల్లా కలెక్టర్ కి సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆర్ అండ్ బి ఈ ఈ రంగయ్య కి ఫిర్యాదు అందజేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గని శెట్టి కోరారు. లంకెలపాలెం బ్రిడ్జి మధ్యలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని ఎస్సీ జడ్ జంక్షన్ సింహాద్రి జంక్షన్ ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ సబ్ స్టేషన్ సినిమాలు జంక్షన్ ఎన్ టి పి సి జంక్షన్ సోమనాయుడుపాలెం ప్రాంతాల్లో పెద్దపెద్ద గోతుల వలన ద్విచక్ర వాహనదారులు ప్రయాణించడం కష్టంగా మారిందని దుమ్మి దూళి కంట్లో పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హిందుజా బొగ్గు లారీలు, ఎన్టిపిసి ప్లేయష లారీలు అధిక లోడుతో ప్రయాణించడం వలన రోడ్లు ధ్వంసం అవుతున్నాయని వెంటనే రోడ్ల మరమ్మత్తు చేయడంతో పాటు పరిమితికి మించి అధిక లోడుతో వెళ్లే వాహనాలను నిలుపుదల చేయాలని గని శెట్టి కోరారు. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమని వెంటనే రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడానికి పరిశీలిస్తున్నామని ఈ ఈ రంగయ్య గనిశెట్టి కి హామీ ఇచ్చారు.
రవికుమార్
ఎన్ డి పి సూర్య ప్రతినిధి