లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యవర్గం నియామకం
బాల మందిరం ఆధ్వర్యంలో సంధిపూడి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం శ్రీమతి అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యవర్గ సమావేశం జరిగింది.సొసైటీకి నూతన కార్యవర్గాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.గౌరవాధ్యక్షులుగా శ్రీ మాన్ అంగర సీతారామాచార్యులు, శ్రీమాన్ వాడపల్లి రంగాచార్యులు, శ్రీమతి చక్రవర్తుల రంగనాయకమ్మ శ్రీమతి అంగర హనుమావతి ఎంపికయ్యారు.అధ్యక్షులుగా వాడపల్లి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు గా అంగర శ్రీనివాస్, వాడపల్లి శేషాచార్యులు ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శి గా అంగర గోపాలకృష్ణాచార్యులు(కృష్ణ శ్రీ) సహాయ కార్యదర్శులు గా చక్రవర్తుల రఘురాం, పెద్దింటి గోపాల్ ఎన్నికయ్యారు.కోశాధికారిగా సంపర పద్మ,అంగర లక్ష్మీ భవాని ఎన్నికయ్యారు.
అనంతరం బాల మందిరం ఆధ్వర్యంలో బాలల సభ జరిగింది.
యోగా, మెడిటేషన్, శ్లోకాలు ,పద్యాలు, కథలు అంశాలలో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు.ఇన్ డోర్ గేమ్స్, పోటీలో విజేతలకు బహుమతులను నిర్వాహకులు అందజేశారు.