కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో వృద్ధురాలి మృతి
అనంతపురం బ్యూరో
కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో వృద్ధురాలి మృతి
అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన.. రైల్వే పోలీసుల కేసు నమోదు
అనంతపురం, సెప్టెంబర్ 28:
కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 69 ఏళ్ల మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందిన ఘటన అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
రైల్వే పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఎం. లక్ష్మి (69), తన భర్త ఎం.వి. చలపతి రావుతో కలిసి బెంగళూరు నుంచి కాచిగూడకు రైలు నంబర్ 12786 కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. ఆమె B3 కోచ్‌లోని బెర్త్ నంబర్ 2లో ప్రయాణిస్తున్నారు. సెప్టెంబర్ 27న రాత్రి 10.50 గంటలకు ముందు అనంతపురం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద రైలు ‘అప్’ లైన్‌లో ఉన్న సమయంలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
వెంటనే 108 అంబులెన్స్‌లో ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
ఈ విషయాన్ని ఆసుపత్రి డ్యూటీ వైద్యుడు, పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బంది రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్‌కు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ స్టేషన్ మాస్టర్ ద్వారా అనంతపురం రైల్వే పోలీసులకు సమాచారం అందింది.
సెప్టెంబర్ 28న తెల్లవారుజామున 2.30 గంటలకు సమాచారం అందుకున్న అనంతపురం RPSI-1762 కె. వెంకటేశులు BNSS సెక్షన్ 194 కింద Cr.No.42/2026గా కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారులకు FIR ప్రతులు అందజేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.