కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
నకరికల్లు : మండలం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత కనుమూరి బాజీ చౌదరి కార్యకర్తల కేరింతలు, హర్షధ్వానాల మధ్య ప్రసంగించారు.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తన కుటుంబానికి ఎదురైన అవమానాలను బాజీ చౌదరి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక దారుణాలు చోటుచేసుకున్నాయని, వాటిని ప్రజలందరూ గమనించారని ఆయన ఆరోపించారు.గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిందని విమర్శించిన బాజీ చౌదరి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.