కౌసర్ ప్రచారానికి విశేష స్పందన..
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :- అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 32 వ డివిజన్ కూటమి అభ్యర్థి కౌసర్ విశేష స్పందన లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జనసేన నాయకులు, వీర మహిళలు కలియతిరిగారు. ఇంటింటికి వెళ్లి కార్పొరేటర్ అభ్యర్థి కౌసర్ గ్లాస్ గుర్తుకు, మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు ఓటు వేయాలని కరపత్రాలు పంచుతూ విజ్ఞప్తి చేశారు. 32వ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే పరమావధిగా మీకు అన్నివేళ అందుబాటులో ఉంటూ పని చేస్తానని కౌసర్ డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రచారానికి వచ్చిన సందర్భంగా డివిజన్ వాసులు కౌసర్ ను సాదరంగా ఆహ్వానిస్తూ.. తమ ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుందని భరోసా ఇవ్వడం విశేషం.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..