కారు - స్కూటీ ఢీ.. వ్యక్తికి గాయాలు వల్లూరులోని.. జాతీయ రహదారిపై ప్రమాదం
కారు - స్కూటీ ఢీ.. వ్యక్తికి గాయాలు
వల్లూరులోని..
జాతీయ రహదారిపై ప్రమాదం
వల్లూరు మేజర్ న్యూస్
వల్లూరు మండల పరిధిలోని కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కపిల్ వెన్సర్ సమీపంలో కారు, స్కూటీ ఢీకొన్న ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం కడప నుంచి అనంతపురం కి కారు వెళ్తుండగా, అలాగే ఒక ద్విచక్ర వాహనం కూడా అనంతపురం రోడ్డు రూటే వెళ్తుండగా, అదే సమయంలో కమలాపురం వైపు నుంచి కడప వైపుకు వస్తున్న స్కూటీ, మూడు వెహికల్స్ ఎదురు ఎదురుగా ద్విచక్ర వాహనం, మరో స్కూటీ, కారు ఢీ కొట్టుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో స్కూటీ పూర్తిగా దెబ్బతినగా, స్కూటీపై ప్రయాణిస్తున్న అలంకానిపల్లికి చెందిన వెంకటేష్‌కు గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వల్లూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వెంకటేష్‌ను 108 అత్యవసర వాహనం ద్వారా కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వల్లూరు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు..