కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మ
కనిగిరి, మేజర్ న్యూస్ : కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో ఆమెను చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అచ్చాల తిరుపతమ్మ అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తూ ఆమె విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. కనిగిరి మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.