కడప ఎన్టీఆర్ సర్కిల్ లో ట్రాఫిక్ సమస్యలు
*కడప ఎన్టీఆర్ సర్కిల్ లో ట్రాఫిక్ ఇబ్బందులు*
రోడ్లపై కార్లు పార్క్ చేయడం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది
కడప ఎన్టీఆర్ సర్కిల్లో వాహనాలు పార్క్ చేయడం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నో పార్కింగ్ బోర్డులు ఉన్నప్పటికీ అక్కడ కార్లు పార్కింగ్ చేస్తున్నారు. ఆర్కే స్టూడియో ఎన్టీఆర్ విగ్రహానికి మధ్యలో కార్లు పార్క్ చేసిన కారణంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది.
రోడ్లపై మరియు నో పార్కింగ్ జోన్లలో వాహనాలు అస్తవ్యస్తంగా పార్క్ చేయడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల సాధారణ వాహనదారులు, పాదచారులు మరియు అత్యవసర సేవలు అందించే వాహనాలు (అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటివి) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.