కావలిపురం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ ఎక్స్‌పోజర్ సందర్శన
ఇరగవరం మేజర్ న్యూస్ :పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రీన్ అంబాసిడర్లతో కలిసి కావలిపురం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ ఎక్స్‌పోజర్ విజిట్ సందర్శించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్ చెప్పారు.షెడ్‌లో జరుగుతున్న ఘన వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను పరిశీలించి ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించిన్నట్లు చెప్పారు. ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌లో తడి,పొడి చెత్తను వేరు చేయడం,రీసైక్లింగ్‌కు అనువైన వ్యర్థాలను గుర్తించడం,వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం వంటి అంశాలను ఎంపీడీవో పరిశీలించారు. చెత్త సేకరణ,వేరు చేయడం, తరలింపు, ప్రాసెసింగ్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో గ్రీన్ అంబాసిడర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రతి ఇంటి వద్ద తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా,స్వచ్ఛంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.కావలిపురం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించిన పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు, వాటిని తమ గ్రామాల్లో కూడా సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అవగాహనను పొందాలన్నారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎ.శ్రీనివాసు గారు సూచించారు.
దొరబాబు ఇరగవరం