జనసేన పార్టీకి 40 శాతం సీట్లు ఇవ్వాలి మిద్దెల హరి
స్థానిక ఎన్నికల్లో జనసేన కోటా 40% ఇవ్వాల్సిందే - జనసేన పార్లమెంట్, అసెంబ్లీ కోఆర్డినేటర్ల సమావేశంలో నేతలు వెల్లడి.
శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం స్థానిక శ్రీకాళహస్తి. సదాశివ టవర్స్ నగిరి వీధిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త మిద్దెల హరి, అసెంబ్లీ సమన్వయకర్తలు శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సత్రవాడ ప్రవీణ్, దండి నరేంద్ర లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రాతినిధ్య కోటా 40 శాతం ఇవ్వాల్సిందేనని నేతలు ముక్తకంఠంతో తెలియజేశారు. కూటమి నేతలు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి , బిజెపి నేత కోలా ఆనంద్, ఇతర ముఖ్య నాయకులతో సమన్వయం చేసుకొని మనకు రావాల్సిన కోటాను రెండు రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి జనసేన పార్టీ విజయడంకా మోగించి జనసేన జెండా ఎగరవేస్తామని తెలియజేశారు.
ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యులు మంజూరు చక్రధర్, జయప్రకాష్, చలపతి, సపోర్ట్ టీమ్ సభ్యులు కిరణ్ కుమార్ రామిశెట్టి, కాపునాడు నాయకులు వేణుగోపాల్, పగడాల ప్రతాప్, రిటైర్డ్ ఎమ్మార్వో చంద్రశేఖర్. నిర్వాహ దళ్ సభ్యులు మాజీ కౌన్సిలర్ జయదేవన్ గిరి, కవిత, గణేష్, పాద దినేష్, గరిక సురేష్, రమేష్, చిరంజీవి, గురవయ్య, పేట శారద, గోపి, ఆరిఫ్, ఆకుల తిలక్, అజయ్ కుమార్ కెనపర్తి, షేక్ హుస్సేన్, నాన్నగారి సురేంద్రబాబు, ఆకుల భాగ్యలక్ష్మి, పరిచర్ల రామచంద్రయ్య, హరికృష్ణ, వెంకటేష్, వరదరాజులు, ముని కుమార్, నవీన్, ఢిల్లీ బాబు, సపోర్ట్ టీం సురేష్, హరికృష్ణ, మహేష్
శ్రీకాళహస్తి నాయకులు దావాలగిరి, గంజి వెంకటేష్, హరి, బాలిశెట్టి నరసింహులు, పోలి గణేష్, లీలా మోహన్, వేణుగోపాల్, మునిశేఖర్, పోలా సాయి, ప్రసాద్, చెర్లోపల్లి అజయ్, నవీన్, పసల గురవయ్య.తొట్టంబేడు నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, శ్రీకాళహస్తి మండల నాయకులు, రేణిగుంట మండల నిర్వాహక సభ్యులు ఆకుల భాగ్యలక్ష్మి, మహబూబ్ బాషా, తిలక్, త్యాగరాజులు, సుజాత, శ్రీకాళహస్తి మండల నాయకులు వెంకటరత్నం, అజయ్ కుమార్, వరదరాజులు, గంధం ఢిల్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు