జనసేన పార్టీ పర్చూరు అసెంబ్లీ సమన్వయకర్తగా ఇంతియాజ్
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
జనసేన పార్టీ పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంకొల్లుకు చెందిన షేక్ ఇంతియాజ్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ అధిస్టానం నుండి లేఖ అందింది. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తిగా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఇంతియాజ్ హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికులను బరిలో నిలిపి గెలుపుకు కృషి చేస్తానని ఇంతియాజ్ హామీ ఇచ్చారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.