జగన్ ఆదేశాల మేరకే వైసీపీ నాయకులు దౌర్జన్యాలు
ఎంపీగా ఉన్న అవినాశ్, మిథున్ రెడ్డిలకు వందల మందిని నామినేషన్ కేంద్రాలకు తీసుకురాకుడదనే విషయం తెలియదా?* • *మానవత విలువలు మరిచి సొంత మేన కోడలు పెళ్లికి జగన్ అడ్డుపడటం సిగ్గుచేటు
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
రాష్ట్రంలో జరిగే అల్లర్లకు కర్త, కర్మ, క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వైసీపీ పార్టీ రాష్ట్రంలో దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ అధినేత బెంగళూరులో ఉంటూ, పొరుగు రాష్ట్రాల నుంచి గ్యాంగ్‌స్టర్లను తీసుకొచ్చి కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమే.. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే, కేవలం రెండు ప్రాంతాల్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఎక్కడో అశాంతి నెలకొన్నట్లు చిత్రీకరించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు చేసే రాజకీయాలకు, వారి తప్పుడు ప్రచారాలకు ప్రజలు భయపడే రోజులు పోయాయని స్పష్టం చేశారు. *గంజాయి, గ్రాడ్యుయేషన్ బ్యాచ్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు:* “ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రంలోకి ముగ్గురికే అనుమతి. కానీ వైసీపీ ఎంపీలైన అవినాశ్, మిథున్ రెడ్డి మాత్రం వందల మందిని తీసుకొస్తారు. అడ్డుతగిలిన పోలీసులపై దాడులకు పాల్పడతారు. బీర్ బాటిళ్లు, రాళ్లు, కర్రలు, హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లతో అధికారులను ప్రజలను బెదిరిస్తారు. ఎంపీగా ఉన్న వీళ్లకు ఎన్నికల నియమావళి తెలియదా? బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం ఇష్టం లేకనే గొడవలు సృష్టిస్తున్నారు. ఈ ఎన్నికలు గంజాయి బ్యాచ్‌కు, గ్రాడ్యుయేషన్ బ్యాచ్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మారాయి. ప్రజల మద్దతు కూటమి పార్టీలపైనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు ఉంది. బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, మహిళలకు, యువతకు కూటమి రాజకీయ అవకాశాలు కల్పిస్తుంటే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా బీసీలు ఎక్కడ పోటి చేస్తున్నారో అక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఆ పార్టీని దూరం పెట్టడం ఖాయం. వైసీపీ హయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. డిష్ క్వాల్ఫీ చేసేందుకు వాళ్ల ఇళ్లలో మందు, గంజాయి దొంగతనంగా పెట్టించి అక్రమ కేసులు పెట్టించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం చేశారు. నేడు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది దౌర్జన్యం,బెదిరింపులతో కాదు, అభివృద్ధి సంక్షేమంతో ప్రజల మనసులు విశ్వాసం గెలుచుకోవాలి. ఈ సత్యాన్ని ఇప్పటికైనా వైసీపీ నాయకులు గుర్తుఎరగాలి. *సొంత మేనకోడలు పెళ్లికి అడ్డుపడుతున్న జగన్ రెడ్డి :* “కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు వేసిన నీచ చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి. అటువంటి మేనకోడల వివాహానికి అడ్డుపడటం ఎంత వరకు సమంజసం. ఆస్తి కోసం సొంత చెల్లి, అమ్మను ఇంటి నుంచి తరిమి వేశారు. ఇప్పుడు అదే ఆస్తి ఎక్కడ తీసుకుపోతుందనే కారణంతో మేనకోడల పెళ్లికి స్థలం ఇవ్వడం లేదు. మనవత విలువలు మరిచి డబ్బులకే తొలి ప్రాధన్యం ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లను ప్రజలు ఎలా ఆదరిస్తారు. ఇంట్లో వివాహానికి అడ్డుపడుతున్నారంటే జగన్ రెడ్డి, వాళ్ల పార్టీ నాయకుల సంస్కృతి ఏంటో స్పష్టం అవుతుందని మండిపడ్డారు.