జడ్పీ చైర్మన్ పీఠంపై ఇరిగెల సోదరుల గురి
జడ్పీటీసీ చైర్మన్ పీఠంపై ఇరిగెల సోదరుల గురి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో జనసేన పార్టీ తన ప్రభావం మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఉప ముఖ్యమంత్రి ,జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీస్సులు, కూటమి పార్టీల సమన్వయంతో నంద్యాల జడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ జనసేన నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన ప్రజా బంధువులు, విస్తృత పరిచయాలు ఉన్న ఇరిగెల సోదరులు ప్రస్తుతం జనసేన పార్టీ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా, అంగబలంగా పటిష్టంగా ఉండటంతో పాటు, నంద్యాల జడ్పీ చైర్మన్ స్థానం జనరల్ రిజర్వేషన్కు కేటాయించబడటంతో ఈసారి జడ్పీ పీఠం రేసులో నిలవాలని వారు గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో సోదరులు తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ, కూటమి అగ్రనేతల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉన్న ఇరిగెల బ్రదర్స్ ఈసారి జడ్పీ ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుండటంతో, ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ అంశం ఆసక్తికరంగా మారింది.