BREAKING
ఐపీఓకు ముందే ఫ్యూజన్ సీఎక్స్ దూకుడు: యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 315 కోట్ల నిధుల సమీకరణ! చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంతో యూరోపియన్ యూనియన్ సన్నాహాలు డిజిటల్ సార్వభౌమత్వమే లక్ష్యం: సావరిన్ క్లౌడ్ మిషన్‌ను బలోపేతం చేసేందుకు టీసీఎస్, మేనేజ్‌ఇంజిన్ వ్యూహాత్మక భాగస్వామ్యం! బ్రిటన్ ఏఐ సేఫ్టీ రీసెర్చ్‌ కోసం 250 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించిన ఎన్విడియా ఢిల్లీ పారిశ్రామిక వాడల ఆధునీకరణే లక్ష్యం: రూ. 170 కోట్లతో రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం! అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనివ్వం అనంతపురం నగరంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం 12 ప్రాంతాల్లో ఒకేసారి పనులకు భూమి పూజ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ కీలక ఫోన్ సంభాషణ: వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం! మహిళల సౌకర్యార్థం పింక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి భూమి పూజ రూపాయిని కాపాడేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందా? కీలక సమీకరణాలను వివరించిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా! పన్ను వసూళ్లలో జోరు: 2026-27 ఆర్థిక సంవత్సర ఆదాయ లక్ష్యాలను కేంద్రం సులభంగా అధిగమించే అవకాశం! భారత్-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు: చైనాను దూరం పెట్టొద్దన్న ఉదయ్ కొటక్.. వ్యూహాత్మక సమతుల్యతపై కీలక విశ్లేషణ! వాటర్ బిల్లులపై 319 మిలియన్ డాలర్ల కోత విధించిన బ్రిటన్ రెగ్యులేటర్ ఏఐ ఆధారిత సైబర్‌ సెక్యూరిటీ సంస్థగా ఏఏఏ టెక్నాలజీస్ రూపాంతరం: 1,000 మంది ఉద్యోగుల నియామకమే లక్ష్యం! గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు: సెప్టెంబర్‌లో 71 శాతం పెరిగి రూ. 4,451 కోట్లకు చేరిన ఇన్‌ఫ్లోలు! భారతీయ రైతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పాటు: జొన్న పరిశోధనలకు ఏఐతో సరికొత్త ఊతం.. గూగుల్ డీప్‌మైండ్ సీవోవో లీలా ఇబ్రహీం వెల్లడి!

ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఊరట.. - సాంకేతికతతో సులభ దర్శనం భారీగా తరలివస్తున్న భక్తులు.. - గంటలోపే అమ్మవారి దర్శనం

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఊరట.. - సాంకేతికతతో సులభ దర్శనం  భారీగా తరలివస్తున్న భక్తులు.. - గంటలోపే అమ్మవారి దర్శనం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అధికారుల సమన్వయంతో గంటలోపే అమ్మవారి దర్శనం పూర్తవుతోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీ.కె. శీనా నాయక్, పాలకమండలి ఛైర్మన్ బొర్రా గాంధీ, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర నేతృత్వంలో సంబంధిత విభాగాలు ఉత్సవాల నిర్వహణలో సమన్వయంతో పనిచేస్తున్నాయి. దర్శన క్యూలైన్ల నిర్వహణ, భక్తుల రాకపోకల క్రమబద్ధీకరణ, రద్దీ పర్యవేక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. సాంకేతిక నిఘాతోపాటు క్షేత్రస్థాయి పోలీసు పర్యవేక్షణ భక్తుల భద్రతకు తోడ్పడుతోంది. భక్తులకు తాగునీరు, వైద్య సహాయం, అన్నప్రసాదం వంటి సౌకర్యాలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు సిబ్బంది సూచనలు పాటిస్తూ క్యూలైన్లలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని అధికారులు కోరుతున్నారు. దేవస్థానం, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ, ఇతర విభాగాల సమన్వయంతో సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో తిరుగు ప్రయాణం సాగిస్తున్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భక్తులు అధికారులకు సహకరించాలని దేవస్థానం కోరుతోంది.