ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాన్సర్ హాస్పిటల్ నందు పోష్ యాక్ట్ -2013 పై అవగాహన కార్యక్రమం
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాన్సర్ హాస్పిటల్ నందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారి ఆదేశాల మేరకు పోష్ యాక్ట్ -2013 పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళలలు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో వారిపై లైంగిక వేధింపులకు గురి అయినట్లయితే పోష్ యాక్ట్ 2013 చట్టం అనేది వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అవగాహన కలిగించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ ఇలాంటి పని ప్రదేశాల్లో వారిపై లైంగిక వేధింపు సంఘటనలు జరిగినప్పుడు భయగ్రాంతులకు మరియు ఆందోళనలకు గురి కాకుండా ధైర్యం గా వారి యొక్క సమస్య ఫోన్ కాల్ ద్వారా కానీ డబ్ల్యూ హెచ్ ఎల్ 181 నెంబర్ ద్వారా గాని లేదా ఎస్ హెచ్ ఈ బాక్స్ ఆన్లైన్ కంప్లయింట్ రిజిస్టర్ చేయడం గాని వారికి అర్దం ఇయ్యే విధంగా పోస్టర్స్ ద్వారా వివరించడం జరిగింది. మరియు హెచ్ ఓ డి అడ్మిన్ కి ఐ సి సి ఏర్పారు చేయడం అత్యవసరం మరియు కంప్లైంట్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి రూల్స్ రెగ్యులషన్స్, చట్టం యొక్క లక్ష్యలు గురించి అవగాహనా కల్పించడం జరిగింది. అలాగే కాన్సర్ హాస్పిటల్‌కు సంబంధించిన మహిళా సిబ్బంది మొత్తం ఈ కార్యక్రమానికి హాజరై పోష్ యాక్ట్ పై అవగాహన పొందారు. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన కార్యాలయ వాతావరణాన్ని కల్పించడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో వివరించారు.ఈ కార్యక్రమంలో కాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ , ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్‌మెంట్ నుండి నోడల్ ఆఫీసర్ వి.బి. అనురాధ, సఖి వో ఎస్ సి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఎస్.కే. షహనాజ్ తో పాటు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మరియు డీవీసీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.