BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

హామ్‌(హెచ్‌ఎఎం)తో పురపాలక సంఘాలకు మహర్ధశ - ఎంఎల్ఏ పాశిం

Select Suryaa Now
హామ్‌(హెచ్‌ఎఎం)తో పురపాలక సంఘాలకు మహర్ధశ - ఎంఎల్ఏ పాశిం

గూడూరు, మేజర్‌న్యూస్‌  :       పురపాలక సంఘాలకు కూటమి ప్రభుత్వంలో మహర్ధశని ఎంఎల్‌ఏ డాక్టర్‌ పాశిం సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలో హామ్‌(హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌) పథకం ద్వారా 30 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు కాలువలు లైటింగ్ మౌలికవసతుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకంతో పురపాలక సంఘాల్లో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని వార్డుల్లో ప్రధాన సమస్యలు నాయకులు తెలియజేస్తే వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. జనసేన బిజెపి నాయకులు కూడా ఎక్కడైనా రోడ్లు సిసి కాలువలు కావాలంటే తెలియజేయాలని కోరారు. పనిచేసే ప్రభుత్వాన్ని మరలా ఆశీర్వదిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.ఈ సందర్శంగా  పలువురికి నివేశ స్థలాల పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశారు. టిడిపి ప్రభుత్వంలోనే పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావు, నాయకులు కిరణ్ కుమార్, చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి, భారతమ్మ, అబ్దుల్‌ రహీం, పులిమి శ్రీనివాసులు ,శివకుమార్, హరికుమార్, చంద్ర నీల్, దయాకర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.